ఖమ్మం నగరపాలక సంస్థ కార్యాలయంలో శుక్రవారం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య NDRF అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. భారీ వర్షాల నేపథ్యంలో NDRF బృందం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మున్నేరు పరివాహక ప్రాంతాల్లో వరదలు సంభవిస్తే తీసుకోవాల్సిన చర్యలు, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.