భారత మహిళా క్రికెటర్ వేద కృష్ణమూర్తి అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది. అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలుకుతున్నట్లు వెల్లడించింది. 2011లో అరంగేట్రం చేసిన వేద.. 48 వన్డేలు, 76 టీ20లు ఆడింది. ఇందులో 10 హాఫ్ సెంచరీల సాయంతో 1704 పరుగులు చేసింది. 2017 వన్డే ప్రపంచకప్, 2020 టీ20 ప్రపంచకప్ రన్నరప్‌గా నిలిచిన భారత మహిళా జట్లలో ఆమె సభ్యురాలిగా ఉంది.