WGL: అభివృద్ధికి దోహదపడే మామునూరు విమానాశ్రయ నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం కీలక ముందడుగు వేసిందని ఎంపీ కడియం కావ్య అన్నారు. భూ సేకరణ నిమిత్తం రూ.205 కోట్లు విడుదల చేస్తూ నేడు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై ఎంపీ హర్షం వ్యక్తం చేశారు. ఎంతో గొప్ప చారిత్రక ప్రాధాన్యం కలిగిన వరంగల్నగర అభివృద్ధిలో ఇది ఒక కీలక మైలురాయి అని అన్నారు.