NLG: కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై ఇతర పార్టీలకు చెందిన పలువురు కాంగ్రెస్లో చేరుతున్నారని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. చిట్యాల మున్సిపాలిటికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొనేటి యల్లయ్య శుక్రవారం తన అనుచరులతో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్యే వేముల సమక్షంలో కాంగ్రెస్లో చేరారు.