KMM: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలని ఎమ్మెల్యే రాగమయి అన్నారు. సత్తుపల్లి మున్సిపాలిటీలో శుక్రవారం నిర్వహించిన ‘వనమహోత్సవం’ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని డివైడర్లలో మొక్కలు నాటారు. వర్షాలు సకాలంలో పడాలంటే మొక్కలు నాటడమే మార్గమని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ‘వనమహోత్సవం’ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని పేర్కొన్నారు.