E.G: కొవ్వూరు రోడ్ కం రైల్వే బ్రిడ్జి మీద నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఓ మహిళ ప్రాణాలను కొవ్వూరు పోలీసులు కాపాడారు. కొయ్యలగూడెంకు చెందిన మహిళ (30) కుటుంబ కలహాలతో గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయాన్ని గమనించిన ఆటో డ్రైవర్ కొవ్వూరు టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సీఐ విశ్వం ఆధ్వర్యంలో ఆ మహిళను కాపాడారు.