SKLM: మాదకద్రవ్యాల వినియోగంతో యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటుందని వీటికి దూరంగా ఉండాలని ఈగల్ టీం సభ్యుడు రామచంద్రరావు తెలిపారు. శుక్రవారం పోలాకి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. నేడు మాదకద్రవ్యాలు వినియోగం ఎక్కువ అవుతుందని దీని పట్ల యువత ఎక్కువగా ఆసక్తి చూపడం వలన ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు.