KMM: మూడు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో విద్యుత్ వినియోగదారులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని TGNPDCL ఖమ్మం ఎస్ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి సూచించారు. వర్షపు కాలంలో విద్యుత్ ప్రమాదాలు అనూహ్యంగా సంభవించే అవకాశం ఉందని తెలిపారు. విద్యుత్ స్తంభాలు, మోటర్ల వద్ద జాగ్రత్తలు వహించాలని పేర్కొన్నారు.