NZB: ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని కమ్మర్పల్లి మండల ప్రత్యేక అధికారి సాయి గౌడ్ అన్నారు. గురువారం మండల పరిషత్ కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ ప్రసాద్, ఎంపీడీఓ శ్రీనివాస్, వ్యవసాయ అధికారి, వైద్యాధికారులు, ఏఈ హౌసింగ్ తదితరులు పాల్గొన్నారు.