ప్రకాశం: పొదిలి పట్టణంలో రోజురోజుకు పెరిగిపోతున్న ట్రాఫిక్‌ను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ట్రాఫిక్ పోలీసులకు కొత్త బైక్‌ను అందజేసింది. ఈ సందర్భంగా గురువారం స్థానిక ఎస్సై వేమన బైక్‌ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ట్రాఫిక్ ఇబ్బంది కలిగినప్పుడు స్పీడ్‌గా ఆ ప్రాంతానికి వెళ్లేందుకు అనుకూలంగా ఈ బైక్ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.