KMM: పాలేరు నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం ఖమ్మం (రూ) గోళ్ళపాడు, ఊటవాగుతండ, మంగళగూడెంలో బీటీ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. నియోజకవర్గంలో ఒక ప్రణాళిక ప్రకారం అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు చెప్పారు. ప్రతి గల్లీకి రోడ్లు నిర్మిస్తామని పేర్కొన్నారు.