W.G: మోగల్లులో కేంద్ర స్వచ్ఛ సర్వేక్షన్ బృందం పర్యటించింది. జిల్లా టీం లీడర్ ఎం.మధుమతి పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో పారిశుధ్యం, పచ్చదనాన్ని పరిశీలించారు. ప్రజలు తమ ఇంటి పరిసరాల్లో పండ్లు, ఆకుకూరలు పండిస్తున్నారా లేదా అని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సర్వేక్షన్ బృందంలో సభ్యులు రెడ్డయ్య, ఎంపీడీవో రాంప్రసాద్ పాల్గొన్నారు.