BDK: మణుగూరు మండల కేంద్రంలోని MLA క్యాంపు కార్యాలయంలో ఆళ్లపల్లి, గుండాల మండలాల ఫారెస్ట్ అధికారులతో ఇవాళ MLA పాయం వెంకటేశ్వర్లు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆదివాసీలు అడవులను నమ్ముకుని బ్రతికేవారని, పాత పొడు భూముల జోలికి వెళ్లవద్దని సూచించారు. కొత్తగా అడవులను నరికితే చర్యలు తీసుకోవాలని, ఏమన్నా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని తెలియచేశారు.