BDK: పినపాక మండలంలోని తోగ్గుడెం గ్రామ పంచాయతీ గోపాలరావుపేట పూర్తిగా జలమయమైంది. డ్రైనేజీలో పూడిక ఉండడం వల్ల నీళ్లు పోవడం లేదని బాధితులు బండగొర్ల నరసయ్య, ముప్పారపు వెంకటేశ్వర్లు, వడ్ల బాబు, పూజారి నరసింహారావు ఇవాళ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల ఇళ్ల నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొందని, అధికార యంత్రాంగం స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు.