MBNR: ఆర్టీసీ బస్ డ్రైవర్లు బాధ్యతాయుతంగా వాహనాలు నడపాలని మహబూబ్‌నగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ భగవంత్‌రెడ్డి అన్నారు. బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో 80 మంది ఆర్టీసీ డ్రైవర్లకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల ప్రాణాలు కాపాడటంలో డ్రైవర్ల పాత్ర ఎంతో కీలకమన్నారు. డ్రైవర్లు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని తెలిపారు.