SRCL: గ్రామ పాలన అధికారి పరీక్షలను సజావుగా నిర్వహించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. గ్రామ పాలన అధికారి పరీక్షల నిర్వహణపై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సంబంధిత అధికారులతో కలెక్టర్ బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నెల 27వ తేదీన జరిగే గ్రామ పాలన అధికారి పరీక్షలకు జిల్లాలో 39 మంది హాజరవుతారన్నారు.