ప్రకాశం: కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి వెళ్లి వివరించాలని గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. బుధవారం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఆరు మండలాల టీడీపీ కార్యకర్తలతో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఇప్పటివరకు అందించిన పథకాలు తదుపరి అందించే పథకాలు ప్రజలకు తెలపాలన్నారు.