SRPT: నేరాల నివారణలో యువత భాగస్వామ్యం కావాలని మునగాల సర్కిల్ సీఐ రామకృష్ణారెడ్డి తెలిపారు. ఇవాళ సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు మునగాల మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ విద్యార్థులకు మునగాల పోలీస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులకు సైబర్ నేరాల పైన అవగాహన కల్పించి పలు రకాల సూచనలను చేశారు.