కృష్ణా: ఉంగుటూరు(M) ఆత్కూరులోని స్వర్ణ భారత్ ట్రస్టులో గురువారం జరగనున్న ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ 57వ స్నాతకోత్సవానికి రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం జిల్లా ఇంఛార్జ్ కలెక్టర్ గీతాంజలి శర్మ ఏర్పాట్లను సమీక్షించారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆమె సూచించారు.