Tesla: ప్రముఖ కంపెనీ టెస్లాలో లేఆఫ్స్ కొనసాగుతున్నాయి. టెస్లా చీఫ్ ఎలెన్ మస్క్ గతవారం కంపెనీలో ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లను తొలగించారు. గత నెల నుంచి టెస్లాలో లేఆఫ్స్ ప్రారంభమయ్యాయి. అయితే చాలామంది ఉద్యోగులను టెస్లా తొలగించింది. దీంతో కొందరు లింక్డిన్లో ఈ విషయాన్ని తెలియజేశారు. ఇందులో భారత టెకీ కూడా ఒకరు ఉన్నారు. ఆమె ఏడేళ్ల పాటు కంపెనీలో వర్క్ చేస్తున్నారు. ఒక నెల క్రితమే తనకు ప్రమోషన్ వచ్చిందని, న్యూజెర్సీ నుంచి వాషింగ్టన్కు మారేందుకు రెడీ అయ్యారట. కానీ మే 3న ఆఫీసుకు వెళ్తే కార్డు పనిచేయలేదు. దీంతో ఆమె బాధపడ్డారు.
ఏడేళ్ల పాటు కష్టపడి పనిచేసిన తర్వాత ఒక్క ఈమెయిల్‌తో బయటకు పంపడం వల్ల ఆవేదనకు గురైందన్నారు. టెస్లా కార్ల విక్రయాలు ఈ మధ్య గణనీయంగా పడిపోవడంతో కంపెనీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. విక్రయాలు పెంచడం కోసం ధరలను తగ్గించింది. త్వరలో అందుబాటు ధరలో కొత్త కార్లను తీసుకురానున్నట్లు ప్రకటించింది. మరోవైపు ఖర్చులను తగ్గించుకోవడం కోసం పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగిస్తోంది. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా తమ కంపెనీలో పనిచేస్తున్న దాదాపు 10 శాతం మంది సిబ్బందిని తొలగించింది.