Director S. V. Krishna Reddy Powerful Interview Tammareddy Bharadwaja
S. V. Krishna Reddy: నానక్రామ గూడలో భూమిని కొనడానికి ఎన్ని ప్రయత్నాలు జరిగాయో, డైరెక్టర్స్ అసోసియేషన్స్ జనరల్ బాడీ మీటింగ్లో ఏం జరిగిందో దర్శకుడు ఎస్ వి కృష్ణారెడ్డి చెప్పారు. ఆరోజుల్లో రూ. 11 లక్షలు పెడితే బాగుండేది. దాని విలువ ఇప్పుడు రూ. 60 కోట్లు, ఇల్లు రూ. 10 కోట్లు అదంతా వాళ్ల వలనే జరిగిందని బాధ పడ్డారు. సినిమాలో హీరో అవుదామనే ఇండస్ట్రీకి వచ్చినట్లు ఎస్ వి కృష్ణారెడ్డి వెల్లడించారు. మొదట్లో క్యాసెట్ల బిజినెస్ పెట్టానని ఎస్ వి కృష్ణారెడ్డి పేర్కొన్నారు. పాత సినిమాల నుంచి చాలా నేర్చుకున్నాను అని తెలిపారు. చాలా సినిమాలు తనకు ఉపయోగపడాయి అని చెప్పారు. అందుకే మొదటి సినిమా నుంచి భిన్నమైన కథలు రాయడం అలవాటు. అలా ప్రతీది కొత్తగా రాయడం అలవాటు అవుతుంది. అలాగే మొదటి సినిమాలో డ్యాన్స్ మాస్టర్ కూడా అవుదామని అనుకున్నట్లు చెప్పారు. మావిచిగురు, ఎగిరే పావురం, శుభలగ్నం, యమలీల లాంటి చిత్రాలు తీయడం వెనుక ఉన్న రహస్యం ఏంటో తెలిపారు. ఇలాంటి ఆసక్తి కరమైన విషయాలను ఎన్నో హిట్ టీవీ ప్రేక్షకులకు కోసం చెప్పారు. వాటి గురించి తెలియాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి.