హీరో రామ్ పోతినేని, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ఇస్మార్ట్ శంకర్. దీనికి సీక్వెల్‌గా వస్తున్న తాజా మూవీ డబుల్ ఇస్మార్ట్. ఎన్నో అంచనాలు రేకిత్తిస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా టీజర్ విడుదల అయింది. ఇది చాలా కమర్షియల్ అనేలా ఉంది.
Double Smart Teaser is here.. Ram Pothineni and Puri Jagannath
Double Smart: మాస్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ నుంచి సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో ఓ ఉత్సాహం ఉంటుంది. అందుకే ఆయనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఉంటారు. అలాగే సూపర్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం డబుల్ ఇస్మార్ట్. ఎందుకంటే పూరిజగన్నాథ్, రామ్ పోతినేని కాంబినేషన్లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ ఏ రేంజ్లో హిట్ అయిందో అందరికీ తెలుసు. ఇప్పుడు అదే కాంబినేషన్లో సూపర్ హిట్ ఫిల్మ్‌కు సీక్వెల్ అనగానే అందరిలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక తాజాగా విడుదలైన టీజర్ అందరి అంచనాలను అందుకునేలా ఉంది. పూరి మార్క్ డైలాగులు, శంకర్ హైదరాబాదీ స్లాంగ్, కామెడీ, యాక్షన్, డ్రామా ఇలా అన్ని హంగులు కలగలిపినట్లు ఫుల్ కమర్షియల్‌గా ఉంది. ఇక టీజర్ ఇలా ఉంటే సినిమా ఏ రేంజ్ ఉండబోతుందో అనే అంచనాలు పెరుగుతున్నాయి.
మాస్ పల్స్ తెలిసిన డైరెక్టర్ ఈ సారి డైలాగ్స్‌లో వాడీవేడీ పెంచారు. కాస్త నాటుగా, ఘాటుగా రాశారు. అదే ఎనర్జీతో హీరో రామ్ రెచ్చిపోయినట్లు టీజర్లో చూస్తే అనిపిస్తుంది. అలాగే గెటప్ శ్రీను, షియాజీ శిండే వీరితో పాటు అలి పోర్షన్ చాలా కొత్తగా అనిపిస్తుంది. ఇక ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ ఎలా ఉంటుందో అనే ఆసక్తినెలకొంది. అలాగే మొయిన్ విలన్‌గా చేసిన సంజయ్ దత్ చాలా స్టైలిష్‌గా కనిపించారు. ఇక టీజర్ ఈ రేంజ్లో ఉంటే మూవీ ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్. విజయం కోసం ఎదురు చూస్తున్న పూరి, రామ్‌లకు డబుల్ ఇస్మార్ట్ బ్లాక్ బస్టర్ ఇస్తుందా లేదా అనేది చూడాలి.