E.G: నాలుగు వరుసల గామన్ వంతెనపై వార్షిక తనిఖీల్లో భాగంగా కొవ్వూరు నుంచి కాతేరు వెళ్లే మార్గాన్ని మూసివేశారు. బేరింగుల తనిఖీ, నిర్వహణ పనుల నేపథ్యంలో కేవలం కాతేరు నుంచి కొవ్వూరు వచ్చే మార్గంలోనే వాహనాలను అనుమతిస్తున్నారు. జనవరి 7వ తేదీన తిరిగి రాకపోకలను పునరుద్ధరిస్తామని టోల్ ప్లాజా మేనేజర్ రాజీవ్ జాదోన్ తెలిపారు. ప్రయాణికులు ఈ మార్పును గమనించాలన్నారు.