VSP: పూసపాటిరేగలో 8 మద్యం సీసాలతో పట్టుబడిన వ్యక్తిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ సీఐ వీ.రవికుమార్ గురువారం తెలిపారు. ఎవరు కూడా అనధికార మద్యం దుకాణాలు (బెల్ట్ షాపులు) నిర్వహించరాదని, వాటిని ప్రోత్సహించరాదని సూచించారు. అనధికార మద్యం దుకాణాల వద్ద మద్యం కొనుగోలు చేసి తాగితే అనారోగ్యం పాలయ్యే అవకాశాలు ఎక్కువని ఆయన పేర్కొన్నారు.