KDP: కమలాపురం సీఎస్ఐ టౌన్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు గురువారం రాత్రి ఘనంగా జరిగాయి. రెవరెండ్ జీవన్ కుమార్ క్రీస్తు జనన సందేశాన్ని అందించి,ఏసు జీవితం ఆదర్శమని తెలిపారు. సండే స్కూల్ విద్యార్థుల నాటకాలు ,సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. పట్టణ ప్రజలు భారీగా తరలివచ్చి ప్రత్యేక ప్రార్థనలు,భజనల్లో పాల్గొనడంతో చర్చి ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.