»Pooja Hegde Shocking Decision Pooja Hegde About To Become A Mother
Pooja Hegde: షాకింగ్ డెసిషన్.. తల్లి కాబోతున్న పూజా హెగ్డే?
గత కొద్ది రోజులుగా.. ఇక పూజా హెగ్డే పనైపోయినట్టేనని ఇండస్ట్రీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. త్వరలోనే పెళ్లి కూడా చేసుకునే ఛాన్స్ ఉందని వార్తలు వస్తున్నాయి. కానీ ఇప్పుడు తల్లి కానుందనే న్యూస్ ఒకటి వైరల్‌గా మారింది.
Pooja Hegde: Shocking decision.. Pooja Hegde about to become a mother?
Pooja Hegde: ప్రస్తుతం హిందీలో ఒకటి రెండు చిత్రాల్లో మాత్రమే నటిస్తోంది పూజా హెగ్డే. తెలగులో మాత్రం ఒక్క సినిమా కూడా అమ్మడి చేతిలో లేదు. దీంతో సోషల్ మీడియాతో టైంపాస్ చేస్తోంది పూజా బేబీ. కానీ ఈ మధ్య ఈ హాట్ బ్యూటీ బాయ్ ఫ్రెండ్‌తో తెగ షికార్లు చేస్తున్నట్టుగా కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. హిందీ బిగ్ బాస్ 10 ఫేమ్ సీరియల్ యాక్టర్ రోహన్ మెహ్రతో.. పూజా ప్రేమలో ఉన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్య పూజా ఎక్కువగా రోహన్తోనే కనిపిస్తోంది.
రీసెంట్గా పూజా హెగ్డే తన ఫ్యామిలీతో కలిసి ఓ రెస్టారెంట్ కు వెళ్లగా.. అక్కడ కూడా రోహన్ కనిపించాడు. దీంతో త్వరలోనే ఈ ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని బీ టౌన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కానీ ఇప్పుడు ఏకంగా తల్లి కాబోతుందనే న్యూస్ హాట్ టాపిక్‌గా మారింది. అయితే.. నిజంగానే పూజా తల్లి కావడం లేదు. సినిమా కోసం తల్లిగా మారాలనే షాకింగ్ డెసిషన్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం పూజాకు సినిమా ఆఫర్లు రావడం లేదు. దీంతో.. ఓ సినిమాలో తల్లి పాత్ర చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా బాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
మేకర్స్ భారీ రెమ్యునరేషన్ ఇస్తామని టెంప్ట్ చేయడంతో.. పూజా అందుకు ఓకే చెప్పిందట. అయితే.. ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. కానీ పూజాకు ఆఫర్ ఇచ్చింది బాలీవుడ్ బడా డైరెక్టర్ అని తెలుస్తోంది. ఇదే కాదు.. మరోవైపు బుట్టబొమ్మ దేవరలో ఐటెం సాంగ్ చేయడానికి సై అన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. గతంలో రంగస్థలం, ఎఫ్ 3 సినిమాల్లో ఐటెం బ్యూటీగా చిందులేసింది పూజా. ఇక ఇప్పుడు ఎన్టీఆర్‌తో స్టెప్పులేయడానికి రెడీ అవుతోందట. ఏదేమైనా.. పూజా తల్లి క్యారెక్టర్ అనేది మాత్రం హాట్ టాపిక్ అనే చెప్పాలి.