Horoscope Today: నేటి రాశిఫలాలు(2024 May 15th).. ఆకస్మిక లాభాలు ఉంటాయి.
ఈ రోజు(2024 April 15th) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశికి వారికి ఎలా ఉండబోతోంది. అనుకున్న పనులు జరుగుతాయా? లేదా? శుభ ఫలితాలు కోసం ఏం చేయాలో నేటి రాశిఫలాల్లో తెలుసుకుందాం.
మేషం
తోటివారికి ఇబ్బందులు కలుగజేసే పనులకు దూరంగా ఉండాలి. మీమీ రంగాల్లో ఇబ్బందులను అధిగమిస్తారు. తలపెట్టిన పనిలో
ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. కొత్తగా ఏ పనులు ప్రారంభించకుండా ఉంటే మంచిది.
వృషభం
ఆడంబరాలకు దూరంగా ఉండటం మంచిది. అనుకోని ధననష్టం ఏర్పడే అవకాశం ఉంది. మానసిక ఆందోళన వేధిస్తుంది. కుటుంబంలో కొంత మార్పును ఆశిస్తారు. మొదలు పెట్టిన పనిలో ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధవహించాలి.
కర్కాటకం
కుటుంబంలో చిన్నచిన్న గొడవలు వచ్చే అవకాశం ఉంది. పరిస్థితిని మీ అదుపులో ఉంచుకోవాలి. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి రుణప్రయత్నాలు చేస్తారు. బంధు, మిత్రుల సహాయ సహకారాలు ఆలస్యంగా లభిస్తాయి.
సింహం
మనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహించడం అవసరం. నూతనకార్యాలకు ఆటంకాలు ఏర్పడతాయి. కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. కఠిన సంభాషణవల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇతరులకు హాని తలపెట్టే కార్యాలకు దూరంగా ఉంటారు.
కన్య
కుటుంతో సంతోషంగా గడుపుతారు. ధనలాభం ఉంది. తద్వారా రుణబాధలు తొలగిపోతాయి. సమాజంలో పేరుప్రతిష్టలు సంపాదిస్తారు. ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటారు. బంధువులను కలుస్తారు.
తుల
మనస్సు స్థిమితంగా ఉండదు. సన్నిహితులతో విరోధం ఏర్పడకుండా చూసుకోవాలి. సమయానికి భోజనం చేయాలి. అనుకోని గొడవలు మొదలు అవుతాయి. చెడు సహవాసానికి దూరంగా ఉండాలి.
వృశ్చికం
మిక్కిలి ధైర్యంతో పనులు మొదలు పెట్టండి. సూక్ష్మబుద్ధితో విజయాన్ని అందుకుంటారు. శత్రువలు గురించి బాధ పడొద్దు. అవి తొలగిపోతాయి. శుభకార్య ప్రయత్నాలు మొదలు పెడుతారు. ముఖ్యమైన వ్యక్తులతో మీటింగులు జరుగుతాయి.
ధనుస్సు
కుటుంబంలో కలహాలు ఏర్పడుతాయి. అశుభవార్తలు వినాల్సి వస్తుంది. ఆకస్మిక ధననష్టం జరుగుతుంది. తీవ్ర మనస్తాపానికి గురవుతారు. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి.
మకరం
సన్నిహితులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. మానసిక ఆందోళన అధికమవుతుంది. అనారోగ్య బాధలు తొలిగిపోతాయి. అనవసర నిందలతో అపకీర్తి పాలౌతారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోవడం విఫలం అవుతారు.
కుంభం
అనుకున్నది జరగదు. అనారోగ్య బాధలు వేధిస్తాయి. సమయానికి భుజించడానికి ప్రాధాన్యమిస్తారు. చంచలంవల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తుతాయి. మనస్సు ప్రశాంతంగా ఉంచుకోవాలి. చిన్నపిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి.
మీనం
సమాజంలో మంచిపేరు సాధిస్తారు. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయం సాధిస్తారు. దైవదర్శనం చేసుకోవడం మంచిది. ఆస్తుల సమస్యలు తొలగిపోతాయి. కళలందు ఆసక్తి ఎక్కువ అవుతుంది.