Keshineni Nani sent the resignation letter to the Speaker
Keshineni Nan: విజయవాడ ఎంపీ కేశినేని నాని లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈరోజు మధ్యాహ్నం సీఎం జగన్ ను కలిసిన విషయం తెలిసిందే. అనంతరం తన రాజీనామా లేఖను లోక్ సభ స్పీకర్ ఓ బిర్లాకు ఈ-మెయిల్ ద్వారా పంపించారు. తరువాత తన రాజీనామా పత్రాన్ని నాని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. “విజయవాడ ఎంపీగా నా పదవికి రాజీనామా చేశాను. రాజీనామా లేఖను గౌరవనీయ లోక్ సభ స్పీకర్ కు ఈ-మెయిల్ చేశాను. తక్షణమే నా రాజీనామాను ఆమోదించాలని విజ్ఞప్తి చేశాను” అంటూ కేశినేని నాని తన ట్వీట్ లో రాసుకొచ్చారు. ఎక్స్ వేదికగా తన రాజీనామా లేఖను కూడా పంచుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. అటు టీడీపీ, ఇటు వైసీపీ పార్టీ నేతలు కండువలు మార్చుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో కెసినేని నాని తన ఎంపీ పదవికి రాజీనామా చేయడం, అంబటి రాయుడు వైసీపీని వీడడం ఇవన్ని రాబోవు రాజకీయాలను ప్రభావితం చేస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
I have submitted my resignation to my membership of Loksabha Vijayawada to the Honourable Speaker through email and requested him to accept my resignation with immediate effect. pic.twitter.com/vIWYPHEXzR