Chandrababu: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu)కు ఏపీ హైకోర్టు (High Court) లో భారీ ఊరట లభించింది. హైకోర్టులో చంద్రబాబుపై ఉన్న పలు కేసులపై బుధవారం విచారణ జరిగింది. ఇన్నర్ రింగ్ రోడ్డు, ఇసుక రవాణ, మద్యం వ్యవహారాల్లో ఏపీ సీఐడీ చంద్రబాబుపై కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. వీటికి ముందస్తు బెయిల్ కోరుతూ న్యాయస్థానంలో చంద్రబాబు 3 పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన హై కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఒకేసారి మూడు కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అలాగే మద్యం కేసులో నిందితులుగా ఉన్న మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, విశ్రాంత ఐఏఎస్ అధికారి శ్రీ నరేష్‌కు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.