»Ambati Rayudu Met Janasena President Pawan Kalyan
Ambati Rayudu: పవన్ కల్యాణ్‌తో అంబటి రాయుడు భేటీ
ఆంధ్రప్రదేశ్ రాజకీయం హీట్ ఎక్కుతోంది. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌తో భారత క్రికెటర్ అంబటి రాయుడు భేటీ అయ్యారు. గంట నుంచి సుధీర్ఘ చర్చలు సాగుతున్నాయి.
Ambati Rayudu: భారత క్రికెటర్ అంబటి రాయుడు(Ambati Rayudu) జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్(Pawan Kalyan)తో భేటీ అయ్యారు. ఇటీవల వైసీపీ(YCP) పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ రోజు పవన్‌తో మంగళగిరి జనసేన కార్యాలయంలో రాయుడు భేటీ కావడంతో.. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాజకీయం ఒక్కసారిగా హీట్ ఎక్కింది. గుంటూరు ఎంపీ టికెట్ ఇవ్వకపోవడంతో అంబటి రాయుడు వైసీపీ నుంచి బయటకు వచ్చినట్లు పలు కథనాలు వచ్చాయి. దీంతో వాటికి చెక్ పెట్టేందుకు తాను దుబాయ్‌లో జరిగే టీ20లో పాల్గొనబోతున్నట్లు ట్వీట్ చేశాడు. అందరూ నిజమే అనుకున్న తరుణంలో మళ్లీ ఆయన యూటర్న్ తీసుకొని రాజీకాయాల్లో అడుగుపెట్టినట్లు తాజా పరిణామాలు చూస్తుంటే అర్థం అవుతుంది. గంట నుంచి ఇద్దరి మధ్య చర్చ సాగుతోంది.