KRNL: భారీ పెట్టుబడులను చూసి వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఓర్వలేకపోతున్నారని బుధవారం మంత్రి సవిత విమర్శించారు. సీఎం చంద్రబాబుపై జగన్ పెట్టిన అక్రమ కేసును కొట్టేశారని గుర్తు చేశారు. జగన్ ఒక్క కేసు నుంచి అయినా బయటపడ్డారా అని నిలదీశారు. పండుగ సందర్భంగా జగన్కు మంచి బుద్ధి ప్రసాదించాలని దేవుడిని కోరుకుంటున్నానని తెలిపారు.