KDP: జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లాలో ‘స్టాప్, ఫేస్ వాష్ అండ్ గో కార్యక్రమం కొనసాగుతోంది. అర్ధరాత్రి దాటాక లారీలు, బస్సులు, కార్లు, వ్యాన్ల డ్రైవర్లకు ముఖం కడిగించి అప్రమత్తంగా వాహనాలు నడపాలని పోలీసులు సూచిస్తున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణే ఈ కార్యక్రమం లక్ష్యం అని తెలిపారు.