గాజాలో ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో పాలస్తీనా ప్రధాని మహ్మద్ సయ్యే తన పదవికి ఈరోజు రాజీనామా చేసారు. దేశాధ్యక్షుడు మహమూద్ అబ్బాస్‌కు తన రాజీనామాను సమర్పించినట్లు పాలస్తీనా ప్రధాని మహ్మద్ సయ్యే తెలిపారు.
Palestine: గాజాలో ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో పాలస్తీనా ప్రధాని మహ్మద్ సయ్యే తన పదవికి ఈరోజు రాజీనామా చేసారు. దేశాధ్యక్షుడు మహమూద్ అబ్బాస్‌కు తన రాజీనామాను సమర్పించినట్లు పాలస్తీనా ప్రధాని మహ్మద్ సయ్యే తెలిపారు. గాజా స్ట్రిప్‌పై దురాక్రమణకు సంబంధించి చోటుచేసుకుంటున్న పరిణామాలు వెస్ట్‌బ్యాంక్, జెరుసలేంలలో హింసాత్మక ఘటనలు తీవ్రతరమైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. హమాస్‌కు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ చేస్తోన్న పోరు ముగిసిన తర్వాత.. ఇక్కడ రాజకీయ ఏర్పాట్ల గురించి పాలస్తీనియన్లలో ఒక ఏకాభిప్రాయం ఏర్పడటానికి వీలుగా తాను రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. అయితే, రాజీనామా ఆమోదంపై అధ్యక్షుడి నుంచి ఇంకా ప్రకటన రాలేదు. పాలస్తీనా ఇన్వెస్టిమెంట్ ఫండ్ ఛైర్మన్‌గా ఉన్న మొహమ్మద్ ముస్తఫాను నూతన ప్రధానిగా నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది.