»Maratha Quota Internet Services Suspended In Three Districts
Maratha Quota: మూడు జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేత!
ముంబాయిలో మరాఠా కోటా ఉద్యమం ప్రస్తుతం హింసాత్మకంగా మారుతోంది. జల్నాలోని ఆందోళనకారులు ఓ ఆర్టీసీ బస్సుకు నిప్పంటించారు. శాంతిభద్రతలను అదుపు చేసేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.
Maratha Quota: ముంబాయిలో మరాఠా కోటా ఉద్యమం ప్రస్తుతం హింసాత్మకంగా మారుతోంది. జల్నాలోని ఆందోళనకారులు ఓ ఆర్టీసీ బస్సుకు నిప్పంటించారు. శాంతిభద్రతలను అదుపు చేసేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. జల్నాలోని పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. అలాగే ఛత్రపతి శంభాజీనగర్, బీడ్ జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిబంధనలు అమల్లో ఉంటాయని తెలిపారు. అంతర్వాలి సారధి గ్రామంలో నిరసన తెలుపుతున్న మరాఠా కోటా ఉద్యమనేత మనోజ్జారంగే, ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఇంటికి ర్యాలీగా వెళ్తానని ప్రకటించారు. దీంతో అక్కడి పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.
పెద్ద సంఖ్యలో అతని మద్దతురాలు అంతర్వాథి గ్రామానికి చేరునే అవకాశం ఉందని ఆంక్షలు తీసుకున్నట్లు స్థానిక కలెక్టర్ తెలిపారు. తనను చంపడానికి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫఢ్నవీస్ ప్రయత్నిస్తున్నారని మనోజ్ జారంగే పేర్కొన్న విషయం తెలిసిందే. జల్నాలోని అంతర్వాలి సారథి గ్రామంలో ఆదివారం చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. మహారాష్ట్ర కోటా బిల్లు ఆమోదం పొందిన అనంతరం తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని.. దీనివెనక ఉప ముఖ్యమంత్రి ఫఢ్నవీస్ ఉన్నారంటూ ఈక్రమంలో ముంబయిలోని ఫఢ్నవీస్ ఇంటికి ర్యాలీగా వెళ్తానని జారంగే ప్రకటించారు.