»Bajaj Cng Bike Worlds First Cng Bike What Is The Price
Bajaj CNG Bike: ప్రపంచంలోనే తొలి సీఎన్జీ బైక్.. ధర ఎంతంటే?
ప్రముఖ ఆటో దిగ్గజం బజాజ్ ఆటో ప్రపంచంలోనే తొలి సీఎన్జీ బైక్‌ను విడుదల చేసింది. ఫ్రీడమ్ 125 పేరుతో దీనిని లాంచ్ చేసింది. ఈ కార్యక్రమానికి కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ హాజరయ్యారు. సీఎన్జీతో పాటు పెట్రోల్‌తో కూడా నడిచే విధంగా ట్విన్ ట్యాంక్‌ను అమర్చారు. మరి ఈ బైక్ ధర, మైలేజీ వివరాలు తెలుసుకుందాం.
Bajaj CNG Bike: World's first CNG bike.. What is the price?
Bajaj CNG Bike: ఫ్రీడమ్ 125 బైక్ మూడు వేరియంట్లలో లభిస్తుంది. ఫ్రీడమ్ డిస్క్ ఎల్ఈడీ, ఫ్రీడమ్ డ్రమ్ ఎల్ఈడీ, ఫ్రీడమ్ డ్రమ్ వేరియంట్లలో లభిస్తుంది. డ్యూయల్ టోన్ కలర్‌తో ఏడు రంగుల్లో ఈ బైక్ లభిస్తుంది. ఇందులో డిస్క్ ఎల్ఈడీ వేరియంట్ ధరను రూ.1.10 లక్షలుగా కంపెనీ పేర్కొంది. డ్రమ్ ఎల్ఈడీ 1.05 లక్షలు, డ్రమ్ వేరియంట్ ధర రూ.95 వేలకే లభిస్తుంది. 125 సీసీ ఇంజిన్ కలిగిన ఫ్రీడమ్ 125లో రెండు కేజీల సీఎన్జీ ట్యాంక్, రెండు లీటర్ల పెట్రోలో ట్యాంక్ ఉంటుంది. రెండూ కలిపి 330 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ తెలిపింది. ఈ ఇంజిన్ 9.5 పీఎస్ పవర్, 9.7 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
సీఎన్జీ పెట్రోల్ ట్యాంక్‌ను సీటు కింద అమర్చారు. ఈ బైక్ 11 రకాల సేఫ్టీ టెస్టుల్లో పాస్ అయ్యిందని కంపెనీ తెలిపింది. సాధారణ పెట్రోల్ బైక్‌తో పోలిస్తే 50 శాతం తక్కువ ఆపరేటింగ్ ఖర్చుతో ఈ బైక్ నడుస్తుందని తెలిపింది. అయితే సీఎన్జీ, పెట్రోల్ మోడ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు మార్చుకోవచ్చని కంపెనీ తెలిపింది. బైక్‌ను ఆపకుండా ఫ్యుయెల్ ఆప్షన్‌ను మార్చుకోవచ్చు. బ్లూటూత్ కనెక్టివిటీతో కన్సోల్, మోనో షాక్ సస్పెన్షన్, పొడవైన సీటుతో ఈ బైక్ వస్తోంది. దీనికి ఎల్ఈడీ రౌండ్ హెడ్‌ల్యాప్ అమర్చారు. బైక్ బుకింగ్‌లు బజాజ్ వెబ్సైట్లో ప్రారంభమయ్యాయని తెలిపింది. మొదటిగా గుజరాత్, మహారాష్ట్రలో తీసుకొస్తామని ఆ తర్వాత ఇతర రాష్ట్రాల్లో దశలవారీగా తీసుకొస్తాని కంపెనీ తెలిపింది.