»Prime Minister Modi And Amit Shah Voted In Ahmedabad
PM Modi: ఓటు వేసిన ప్రధాని మోడీ, అమిత్ షా
గుజరాత్లో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ అహ్మదాబాద్‌లోని రాణిప్ ప్రాంతంలో ఓటు వేశారు. ఆయనతో పాటు కేంద్ర మంత్రి అమిత్ షా సైతం ఓటు హక్కును వినియోగించుకున్నారు.
PM Modi: లోక్‌సభ ఎన్నికలలో భాగంగా నేడు మూడో దశ పోలింగ్ జరుగుతుంది. గుజరాత్లో జరుగుతున్న ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ తన ఓటు హక్కుని వినియోగించుకున్నారు. అహ్మదాబాద్‌లోని రాణిప్ ప్రాంతంలో నిషాన్ హయ్యర్ సెకండరీ స్కూల్లో మోడీ ఓటు వేశారు. మంగళవారం ఉదయం 7:30 గంటలకు ప్రధాని పోలింగ్ జరిగే ప్రదేశానికి వచ్చారు. అక్కడే ఉన్న అమిత్ షా మోడీకి స్వాగతం పలికారు. అనంతరం ఇద్దరు కలిసి బూత్‌కు వెళ్లారు. అదే సమయంలో ప్రధానిని చూసేందుకు చాలా మంది వచ్చారు. ఓటు వేసిన అనంతరం మోడీ బయటకు వచ్చి ప్రజలకు ఉద్దేశించి ప్రసంగించారు.
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కుకు వెలకట్టలేని విలువ ఉందని అందరూ తమ హక్కును వినియోగించుకోవాలని చెప్పారు. ఇది కేవలం అహ్మదాబాద్ ప్రజలకు మాత్రమే కాదని దేశవ్యాప్తంగా ఉన్న పౌరులకు, ఓటర్లకు చెబుతున్నాని అన్నారు. ఇంకా నాలుగు దశల పోలింగ్ మిగిలి ఉందని, ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుందని పేర్కొన్నారు. పౌరులంతా ఇదే స్పూర్తి ఓటు హక్కును వినియోగించుకోవాలని, తద్వారా ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుందని అన్నారు. అదే విధంగా ఎన్నికల సంబంధించిన వార్తలను కవర్ చేస్తున్న జర్నలిస్టులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎండ కాలంల నీరు ఎక్కువ తాగి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు.