TG: రాష్ట్రంలో మళ్లీ గ్రూప్-1 పరీక్ష నిర్వహించాలని మాజీ మంత్రి కేటీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టీజీపీఎస్సీ అవినీతిపై జ్యుడీషియల్ కమిషన్ వేయాలని తెలిపారు. హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలన్నారు. ఈ వ్యవహారంలో దోషులను బయటకు తేవాలన్నారు. ఈ అంశంపై రాహుల్ గాంధీ స్పందించాలన్నారు.