TPT: ముఖ్యమంత్రి సహాయనిధి పేద కుటుంబాలకు భరోసా లాంటిదని నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ చెప్పారు. ఇవాళ సాయంత్రం పుత్తూరు పట్టణంలోని 2 వ వార్డ్, కె.యం. అగ్రహారానికి చెందిన చిరంజీవికి ముఖ్య మంత్రి సహాయనిధి నుంచి రూ. 4,83,226 మంజూరు చేయించారు. అయితే ఇవాళ చెక్కును ఆయన ఇంటికి వెళ్లి అందజేశారు.