CTR: నాటి వైకాపా సర్కార్ అక్రమంగా కేసులు నమోదు చేసి CM చంద్రబాబును అరెస్టు చేసిన చీకటి రోజులకు రెండేళ్లు పూర్తయ్యాయని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ఒక ప్రకటనలో గుర్తుచేశారు. అరెస్టును రాష్ట్ర ప్రజలతో పాటు ప్రపంచంలోని తెలుగువారంతా తీవ్రంగా ఖండించారని తెలిపారు. రైతులకు అవసరమైన యూరియాను తెప్పించి ఇస్తున్నా.. వైకాపా నాయకులు డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు.