గద్వాల జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు, ప్రజాకవి కాళోజీ నారాయణరావు 111వ జయంతి సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగు సాహితీ రంగానికి కాళోజీ చేసిన సేవలు మరువలేనివని, తెలంగాణ భాషా పరిరక్షణకు, ప్రజల్లో ఉద్యమ చైతన్యం నింపిన మహనీయుడని కొనియాడారు.