BHPL: చిట్యాల మండలం కైలాపూర్ గ్రామంలో క్రీ.శే. సకినాల కుమారస్వామి స్మారక రక్తదాన శిబిరాన్ని మంగళవారం ఎస్సై శ్రావణ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రక్తదానం ప్రాణదానంతో సమానమని, 18 నుంచి 55 ఏళ్లలోపు 48 కిలోలకు పైబడిన వారు రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో యువకులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.