కృష్ణా: కృష్ణా జిల్లాలో యూరియా సరఫరా నిరంతరాయంగా జరుగుతుందని ఎస్పీ ఆర్.గంగాధరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటివరకు 3,180 మెట్రిక్ టన్నులు పంపిణీ చేసినట్లు ఆయన వివరించారు. రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని, టోకెన్ విధానం ద్వారా అర్హులందరికీ యూరియా అందజేస్తున్నామని చెప్పారు. అక్రమ నిల్వలు, రవాణా లేదా అపోహలు సృష్టించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు.