E.G: రాజమండ్రిలోని 49వ డివిజన్లో ఉన్న అన్న క్యాంటీన్ సమీపంలో మంగళవారం సాయంత్రం రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి సమస్యల పరిష్కారం కోసం అధికారులకు సూచనలు ఇచ్చారు. విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని, డ్రైనేజీలు నిర్మించాలని, నిత్యం పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టాలని తదితర సూచనలు ఇచ్చినట్లు తెలిపారు.