BHPL: జిల్లా ఐడీవోసీ కార్యాలయంలో మంగళవారం కలెక్టర్ రాహుల్ శర్మ ప్రిన్సిపళ్లు, ప్రత్యేక అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, సంక్షేమ వసతి గృహాల్లో యు-డైస్ నమోదు, సిబ్బంది హాజరు 100% అమలు కావాలని ఆదేశించారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం లెక్చరర్లు ఉత్తీర్ణత కోసం కృషి చేయాలని సూచించారు.