KMM: నగరానికి చెందిన సీనియర్ న్యాయవాది జహీర్ అలీపై మంగళవారం కొందరు దుండగులు విచక్షణారహితంగా దాడి చేశారు. ఓ కేసు విషయమై లీగల్ నోటీస్ పంపిన న్యాయవాదిపై ప్రతివాది, కొందరు ఆఫీస్‌కి వచ్చి బెదిరించి, డాక్యుమెంట్స్ తీసుకునే ప్రయత్నంలో జహీర్ అలీపై దాడి చేసినట్టు తెలుస్తోంది. కాగా జహీర్ అలీపై దాడి విషయం తెలియగానే, న్యాయవాద సంఘాలు దాడి ఖండించాయి.