నల్లగొండ జిల్లాలో మిర్యాలగూడ పట్టణానికి చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు, టీవీ-5 రిపోర్టర్ దండ భాస్కర్ (52) కుటుంబానికి బీఆర్ఎస్ యువనేత నల్లమోతు సిద్దార్థ 50 వేల రూపాయలు తక్షణ ఆర్థిక సాయంగా అందజేశారు. ఈ సందర్భంగా సిద్దార్థ మాట్లాడుతూ…. భాస్కర్ కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటానని భరోసాని ఇచ్చారు. వారి పిల్లలపై చదువులకు అండగా ఉంటానని తెలిపారు.