‘కొత్త లోక’ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈ సినిమా విడుదలైన 13 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.200 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ మేరకు నిర్మాత దుల్కర్ సల్మాన్ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టర్ రిలీజ్ చేశాడు. సూపర్ ఉమెన్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రంలో కళ్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో నటించింది. కాగా, ఈ చిత్రాన్ని దుల్కర్ కేవలం రూ.30 కోట్లతో నిర్మించాడు.