అన్నమయ్య: సెప్టెంబర్ 10వ తేదీ నుంచి టాప్ గ్రేడ్ బొప్పాయి కిలోకు రూ.8, సెకండ్ గ్రేడ్ బొప్పాయి కిలోకు రూ.7గా ఎగుమతి ధరలను జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి మంగళవారం ప్రకటించారు. మార్కెట్లో వ్యాపారులు నిర్దేశిత ధరల కంటే తక్కువకు అమ్మితే, వెంటనే కంట్రోల్ రూమ్ నంబర్లు 95739 90331 / 90303 15951లను సంప్రదించాలని రైతులకు సూచించారు.