GNTR: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో మంగళవారం ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇండియా స్కిల్ కాంపిటీషన్-2025పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో 250 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రికను వీసీ గంగాధర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు తమ నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలని సూచించారు.