NGKL: తెలంగాణ ఉన్నత విద్య మండలి నిర్వహించిన పీజీ సెట్ 2025 ప్రవేశ పరీక్షలో పదర మండలం ఉడిమిల్ల విద్యార్థిని హరిత సత్తా చాటింది. రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంక్ సాధించింది. భౌతిక శాస్త్రం పట్ల మక్కువతో ర్యాంక్ సాధించినట్లు తెలిపింది. తల్లితండ్రులు రామాంజనేయులు, ఉమాదేవి సంతోషం వ్యక్తం చేశారు. గ్రామస్థులు పలువురు అభినందించారు.